ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పాంచాలి సర్పంచ్ యుగంధర్ అన్నారు. సోమవారం పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో సిఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేపట్టారు. అనంతరం పింఛన్లు ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.