మండల కేంద్రమైన పాచిపెంట శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే ఉద్దేశ్యంతో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన దామోదరన్ విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ పద్మ నాదన్, గీతా పద్మ నాదన్ లు మూడు కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లను విరాళంగా సమకూర్చి తమ వితరణ చాటుకున్నారు. శుక్రవారం విద్యార్థుల వినియోగం నిమిత్తం విద్యాపీఠం విజయనగరం విభాగ్ కార్యదర్శి బాలి విశ్వేశ్వరరావు ప్రారంభించారు.