సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలోని చల్లపేట ప్రాథమిక వైద్యాధికారి జిలాని బాష ఆధ్వర్యంలో పెదమేడపల్లి గ్రామంలో బుధవారం క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పీడితులు ఇంటింటికి వెళ్లి మధుమేహ వ్యాధిగ్రస్థులందరికీ కఫం పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందించడం జరుగుతుందని జిలాని అన్నారు. ఈ కార్యక్రమం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.