మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలను శుక్రవారం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించి, అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను గమనించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.