సాలూరు: అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం

79చూసినవారు
అత్యాధునిక సౌకర్యాలతో వందపడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు. శనివారం సాలూరు పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని కొత్తగా వంద పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2025 మార్చి నాటికి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్