మన్యం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి 71 మంది ఎంపికయ్యారని డీఈవో జీ. పగడాలమ్మ తెలిపారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో వీరికి అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. 10 మంది ప్రధాన ఉపాధ్యాయులు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7గురు పీడీలను, 33 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లను జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపిక చేశామన్నారు.