సాలూరు లో దాహం కేకలు

73చూసినవారు
సాలూరు లో దాహం కేకలు
సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గత నెల రోజులుగా ప్రజలు తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. కాలనీలోని మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాలకు దగ్గరలో ఉన్న పైలట్‌ వాటర్‌ స్కీం 20 రోజులుగా పని చేయడం లేదు. దీంతో సమీపంలో ఉన్న నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. పైలట్‌ వాటర్‌ స్కీంకు చెందిన మోటార్‌ పాడవ్వడంతో పని చేయడం లేదని, మరమ్మతు చేయాలని స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్