హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి డిమాండ్ చేశారు. శనివారం ఎల్ కోట టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ వైసిపి నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడి పవిత్రమైన లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసిపి హయాంలో అన్నదానాన్ని సైతం బ్రష్టు పట్టించి, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.