పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉంటోందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. నియోజకవర్గంలో గల 14 మందికి రూ. 18, 81, 201 చెక్కులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.