బస్సులు సక్రంగా రాలేదంటూ విద్యార్థులు నిరసన

56చూసినవారు
బస్సులు సక్రమంగా రావటంలేదంటూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. సంతకవిటి రహదారిలో తాలాడ గ్రామం వద్ద సోమవారం రోడ్డు పై బైఠాయించారు. ఆర్టీసీ యాజమాన్యం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ. రాయితీ బస్ పాసులు అందించిన ఆర్టీసీ సంస్థ తమకు అవసరమైన సర్వీసులు నడపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరసనకు దిగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్