ఉండి: రతన్ టాటా మరణం పట్ల ఎమ్మెల్యే ఆవేదన
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, సేవ మూర్తి రతన్ టాటా మరణం పట్ల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి ఫలితం ఆశించకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ఆయన మృతి అంటే దేశానికి ఎటు ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థించారు.