ఉండిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేసారు. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఎంతో అభివృద్ధి చెంది దక్షిణ భారతదేశంలో ఉత్తమ ఐటిఐ కాలేజీగా అవార్డు పొందిందని అన్నారు. ఈ కాలేజీలో నూతన భవనాలు నిర్మించి, మరిన్ని కొత్త కోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.