'విజ‌య‌న‌గ‌రంనుంచి విజ‌య‌వాడకు కూర‌గాయ‌లుపంపిణీ

66చూసినవారు
'విజ‌య‌న‌గ‌రంనుంచి విజ‌య‌వాడకు కూర‌గాయ‌లుపంపిణీ
విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు రెండో రోజూ వ‌ర‌ద స‌హాయం పంపించే కార్య‌క్ర‌మం కొన‌సాగింది. జిల్లా క‌లెక్ట‌ర్ బి. ఆర్‌. అంబేద్క‌ర్ సూచ‌న‌ల‌తో వ‌ర‌ద బాధితుల స‌హాయార్ధం 5. 50 ట‌న్నుల కూర‌గాయ‌ల‌ను, వాట‌ర్ బాటిళ్లు, బిస్కెట్లు త‌దిత‌ర నిత్యావ‌స‌రాల‌ను మార్కెటింగ్ శాఖ పంపించింది. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌రాల‌తో వెళ్తున్న వాహ‌నాన్ని క‌లెక్ట‌ర్ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్