మిస్సింగ్ యువతిని రప్పిస్తున్న పవన్!

13253చూసినవారు
మిస్సింగ్ యువతిని రప్పిస్తున్న పవన్!
తాజాగా పవన్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విజయవాడకు చెందిన ఓ మహిళ తన కూతురు అదృశ్యమైందని, అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే అప్పటికప్పుడు పోలీసు అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. విజయవాడలో ఏడాదిన్నర క్రితం మిస్సయిన యువతి కోసం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు చేపట్టారు. చివరికి జమ్మూలో ఆమె ఉన్నట్లు తాజాగా గుర్తించారు. దీంతో పోలీసుల్ని పంపి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్