డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు ఎవరూ భయపడరని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. కుల,మతాలపరంగా ప్రజలను రెచ్చగొడుతూ ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 'పవన్ గతంలో బాప్టిజం తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యత లేకుండా ప్రవరిస్తున్నారు. ప్రశ్నించిన నాపైకి జనసైనికులను పంపి దాడి చేయిస్తున్నారు' అని ఆయన ఫైర్ అయ్యారు.