దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసలిక్కడి యువత USకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించారు. ‘డల్లాస్‌లో 15- 20 మంది ఒకే రూమ్‌లో నిద్రించడం చూశా. లోన్లు తీసుకొని, పొలాలు అమ్మి రూ.30-50 లక్షలు ఖర్చుచేసి US వచ్చినట్టు వారు చెప్పారు. ఆ డబ్బుతో బిజినెస్ చేయొచ్చు కదా అంటే హర్యానాలో పరిస్థితులేం బాలేవన్నారు. ధరలు పెరగడంతో ప్రయత్నించి నష్టపోయామన్నారు’ అని వివరించారు.