AP: మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.