వచ్చే నెలలో సినిమా షూటింగ్ లో పాల్గొననున్న పవన్?

64చూసినవారు
వచ్చే నెలలో సినిమా షూటింగ్ లో పాల్గొననున్న పవన్?
ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత సినిమాలను పక్కన పెట్టి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన సినిమా షూటింగ్ లకు వెళ్తారనే టాక్ నడుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో ఓజీ షూటింగ్ లో పాల్గొంటారని సినీ వర్గాల సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్