ఓటరును చెంపదెబ్బ కొట్టిన MLAపై కేసు నమోదు

50878చూసినవారు
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నిన్న క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లటాన్ని ప్రశ్నించిన ఓటరుపై చెయ్యి చేసుకున్నారు. ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఏడుగురు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్