మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రకూట్ సర్ధువా పోలీస్ స్టేషన్ పరిధిలోని భడేడు గ్రామంలో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.