AP: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రుల సంఘం సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. 'ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? అధికారంలోకి రాగానే పథకం ప్రకారం నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ప్రైవేటు బీమా కంపెనీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే కదా' అని ట్వీట్ చేశారు.