AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేడు నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే బకాయిలు చెల్లించలేదని వైద్య సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.