AP: పంటల బీమా పథకం దరఖాస్తు గడువును బీమా కంపెనీలు పొడిగించాయి. అయితే వరికి మాత్రమే ప్రీమియం గడువును పెంచేందుకు బీమా కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించాయి. జీడి పంటకు గతేడాది నవంబర్ 22తో, మిగిలిన అన్ని పంటలకు డిసెంబర్ 31తో బీమా ప్రీమియం చెల్లించడానికి గడువు ముగిసింది.