రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం కేంద్ర కొత్త పథకాన్ని ప్రకటించింది. మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం వివరాలు వెల్లడించారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే.. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయనున్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత.. బాధితులకు గరిష్టంగా రూ.1.5 లక్షల చికిత్స ఖర్చు తక్షణమే అందజేస్తుందని గడ్కరీ చెప్పారు.