కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు మరో ముందడుగు వేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతు సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను ఆమోదించాలని రైతులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.