AP: కమిట్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ ‘పవన్ కళ్యాణ్’. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించేవరకు పట్టు వదలరు. దానికి ప్రత్యేక నిదర్శనం 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసి గెలవడమే. కూటమి కోసం బీజేపీ, టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కుదర్చడంలో పవన్ కీలకంగా పని చేశారు. వైసీపీని గద్దె దించడంలో పవన్ గేమ్ ఛేంజర్‌గా వ్యవహరించారు. దాని వల్ల 2024 ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.