ఏపీలో మళ్లీ రాజకీయ కాక మొదలైంది. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డిని వైసీపీ ప్రకటించింది. తాజాగా టీడీపీ అభ్యర్థలను ఖరారు చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పేరును ఫైనల్ చేశారు. మరోవైపు ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.