ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించి రవాణా చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని దర్శి సీఐ రామారావు తెలిపారు. దర్శి పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలలో నిబంధనల మేరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. ఆటో నడిపే ప్రతి ఒక్క వ్యక్తి డ్రెస్ కోడ్ పాటించాలని, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు.