దర్శి పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. దర్శి నగరపంచాయతీ పరిధిలోని శ్రీ శివ నాగసాయి దత్త ఆశ్రమం నందు సాయిబాబా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, స్వామి వారికి వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు.