దర్శి పట్టణంలోని పదో వార్డులో బుధవారం దర్శి
వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాజన్న పాలన కావాలంటే మళ్లీ
జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు సూచించారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బట్టలు ఇస్త్రీ చేసి వినూత్నంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో
వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.