జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన తాళ్లూరులోని గుంటిగంగమ్మ సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.