అర్ధవీడు మండలం అంకభూ పాలెం గ్రామంలో గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి ఆదేశాల మేరకు తురిమెళ్ళ రేంజి ఎఫ్ఆర్ఓ మధు ప్రియాంక ఆధ్వర్యంలో గురువారం అడవికి నిప్పు సమస్త జీవకోటికి ముప్పు అనే కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అడవులను సంరక్షించుకోవాలని, నిప్పు పెట్టడం ద్వారా అడవులు అంతరించిపోయి మానవుడి ఆక్సిజన్ అందదని అన్నారు. వర్షాలు కూడా పడకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.