గిద్దలూరు వెంకటేశ్వర కాలనీలో మంగళవారం నాగుపాము హల్చల్ చేసింది. ఓ ఇంటి పక్కన ఉన్న డ్రైనేజీ కాలువ వద్ద విషపూరితమైన నాగుపాము కనిపించింది. ఆందోళన చెందిన స్థానిక ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు నాగుపామును చాకచక్యంగా బంధించి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.