ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని యువకులు దేశానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.