అనుమతులు తప్పనిసరి

73చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ మధుసూదన్ రావు వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకునే విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని గురువారం మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగల్ విండో ఆధారంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరన్నా అనుమతులు పొందాలంటే 7995095800 నంబర్ కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే విధివిధానాలు మెసేజ్ రూపంలో వస్తాయని వాటిని అనుసరిస్తూ అనుమతులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్