చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

75చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి  మృతి
రాచర్ల మండలం అనుమూల పల్లె గ్రామానికి చెందిన సిద్ధార్థ (30) పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 19వ తేదీన నంద్యాల జిల్లా సిరివెళ్ల నల్లమల అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు సిద్ధార్థ ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్