ప్రేమికుడిని మర్చిపోలేక ప్రియురాలు ఆత్మహత్య

64చూసినవారు
ప్రేమికుడిని మర్చిపోలేక ప్రియురాలు ఆత్మహత్య
గిద్దలూరు మండలం ఉప్పలపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఓ యువతి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో యువతి ప్రేమలో పడింది. వాళ్ల పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో 4 నెలల క్రితం యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న యువతి ప్రేమికుడిని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్