ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామస్తులు అక్కపల్లి గ్రామానికి చేరుకొని సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను అర్చకులు భక్తులకు వివరించి చెప్పారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.