కనిగిరి మండలంలోని పోలవరం గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి మండల టిడిపి అధ్యక్షులు, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కామిరెడ్డి మాలకొండ రెడ్డి, షేక్ బారాయిమామ్, పేరం రాజశేఖర్ శేఖరరెడ్డి, షబ్బీర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.