కనిగిరి: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

81చూసినవారు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జెపి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనిగిరిలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం రామారావు మాట్లాడుతూ అర్హులైన పేదలకు పక్కా గృహాలను కూడా నిర్మించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్