రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.