కొండేపిలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద మంగళవారం కట్టేల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ముండ్లమూరు మండలం శంకరాపురంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు.