సింగరాయకొండ మండలం పోనుగంటి వారి పాలెం గ్రామంలో శనివారం అక్రమంగా మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 8 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ శివకుమారి తెలిపారు. మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు.