ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం ఐడియల్ యూత్ మూమెంట్ వారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, అశ్లీలానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఈ వాల్ పోస్టర్ ను మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. యువత బంగారు భవిష్యత్తును పరిరక్షించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.