మార్కాపురం పట్టణంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి బీసీ జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందులని జేఏసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీసీ బాలికలకు పట్టణంలో సంక్షేమ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.