మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేషన్ కార్డుదారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం కొనడమే కాదు అమ్మడం కూడా తీవ్రమైన నేరమని రేషన్ కార్డ్ దారులను చిరంజీవి హెచ్చరించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అత్యధికంగా రేషన్ దందా జరుగుతుందని తెలిపారు.