ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే నేడు జాతీయ పండుగ జరుపుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.