పొదిలి లోని పిచ్చిరెడ్డి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటిలో చోరీ చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. చోరీ అనంతరం దొంగలు ఇంటికి నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన రమణమ్మ వ్యక్తిగత పనులపై ఒంగోలు వెళ్ళింది. దొంగలు రూ. 50 వేలు నగదు, ఆరు సవర్ల బంగారాన్ని దొంగిలించుకు వెళ్లారు. తర్వాత దొంగలు ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంటిలోని విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.