ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారిగా మార్కాపురం కు చెందిన డీఎస్పీ డాక్టర్ టి. యశ్వంత్ నియమితులయ్యారు. యశ్వంత్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి, తిరుపతి వెస్ట్, జమ్మలమడుగు సబ్ డివిజన్లకు డిఎస్పీగా పని చేశారు. ఈయన డీఎస్పీగా పని చేసిన పలు ప్రాంతాల్లో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు.