కనిగిరి: కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలి

59చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కనిగిరిలో నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్